ఏపీలో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 45,702 నమూనాలను పరీక్షించగా తాజాగా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఏపీలో కొవిడ్ కేసుల సంఖ్య 8,90,692కు చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు.
ఏపీలో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి కొత్తగా ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 998 యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు
ఇప్పటి వరకు కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,174కు చేరింది. 24 గంటల్లో 58 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 998 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,36,179 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.