టీఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ పోటీలను... రాష్ట్ర క్రీడా ప్రాధికారక సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీమ్ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఉద్యోగులు... పలు క్రీడాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన క్రీడా పోటీలు - sports competitions in hyderabad
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు పలు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
![టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన క్రీడా పోటీలు tngos sports meet started in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9816427-182-9816427-1607497152182.jpg)
tngos sports meet started in hyderabad
మొదటి రోజు నిర్వహించే క్రికెట్లో 19 బృందాలు తలపడనున్నాయి. నాలుగు గోడల మధ్య అనునిత్యం ఒత్తిడితో పని చేసే ఉద్యోగులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వెంకటేశ్వర్‌రెడ్డి, సలీమ్ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు... రోజూ వ్యాయామం తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు.