TNGOs meet CS: ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియలో పరస్పర బదిలీలు, భార్యభర్తల కేసులకు అవకాశం ఇచ్చిన బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎన్జీఓ కోరింది. ఈ మేరకు టీఎన్జీఓ నేతలు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఉద్యోగులకు మూడు డీఏ బకాయిలను చెల్లించేందుకు అనుమతించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
TNGOs meet CS: 'దానిపై రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం'
TNGOs meet CS: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను టీఎన్జీఓ నేతలు సచివాలయంలో కలిశారు. ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియలో పరస్పర బదిలీలు, భార్యభర్తల కేసులకు అవకాశం ఇచ్చిన బదిలీలు చేపట్టాలని కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.
ఉద్యోగుల విభజనలో భార్యాభర్తల కేసులు, పరస్పర బదిలీల కేసులు, సీనియార్టీలో జరిగిన పొరపాట్లను సవరించడంతో పాటు అప్పీళ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను కోరారు. స్పౌజ్ కేసులు, పరస్పర బదిలీలు, అప్పీళ్ల పరిష్కారం లాంటి అంశాలకు సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదీ చదవండి :జీవో 317పై స్టే ఇచ్చేందుకు మరోసారి నిరాకరించిన హైకోర్టు