తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉద్యోగులందరూ భారత్​ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలి: టీఎన్జీవో - భారత్​ బంద్​కు టీఎన్జీవో మద్దతు

రేపటి భారత్ బంద్‌లో పాల్గొంటున్నట్లు టీఎన్జీవో ప్రకటించింది. ఉద్యోగులందరూ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని సంఘం మామిళ్ల రాజేందర్ కోరారు. రైతుల పోరాటానికి రాష్ట్ర ప్రజల తరఫున కేసీఆర్ మద్దతు చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు.

tngo
tngo

By

Published : Dec 7, 2020, 3:53 PM IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ప్రకటించిన రేపటి భారత బంద్​కు తెలంగాణ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. రేపటి బంద్‌లో పాల్గొనాలని వారు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు బంద్​లో పాల్గొంటున్నామని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రకటించారు.

అన్ని జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలో బంద్​లో పాల్గొంటామని, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బంద్ సందర్భంగా ఉద్యోగులకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి :ప్రగతిభవన్‌ ముట్టడికి మహిళా పీఈటీ అభ్యర్థుల యత్నం

ABOUT THE AUTHOR

...view details