తెలంగాణ

telangana

ETV Bharat / city

తక్షణమే విద్యా క్యాలెండర్​ను అమలు చేయాలి: కోదండరాం - telangana news

కరోనా సాకుతో సీఎం కేసీఆర్​ విద్యను నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు విద్యను కోల్పోయే ప్రమాదం ఉందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యా క్యాలెండర్​ను అమలు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

తక్షణమే విద్యా క్యాలెండర్​ను అమలు చేయాలి: కోదండరాం
తక్షణమే విద్యా క్యాలెండర్​ను అమలు చేయాలి: కోదండరాం

By

Published : Jan 8, 2021, 4:53 PM IST

రాష్ట్ర ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేయడం శోచనీయమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కరోనా సాకుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యను కోల్పొయే ప్రమాదం ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా క్యాలెండర్‌ను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశంలో 17 రాష్ట్రాల్లో అకాడమిక్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారని...తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అకాడమిక్‌ ఇయర్ ప్లాన్‌ను ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు.

విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. బడ్జెట్​లో విద్యా సంస్థలకు ప్రభుత్వం ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని... జీవో 45 ప్రకారం ప్రైవేట్‌ అధ్యాపకులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి: పంచభూతాలను దోచుకుంటున్న పార్టీ తెరాస: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details