'రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడుతున్నారు' - తెజస
లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే విధంగా రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెజస అధ్యక్షుడు పొఫ్రెసర్ కోదండరాం అన్నారు.
ప్రస్తుత రాజకీయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయనాయకులకు, ప్రజలకు మధ్య తల్లీబిడ్డల సంబంధం ఉండాలన్నారు. ఆర్థిక ప్రయోజనాలు ఆశించి రాజకీయాల్లోకి వచ్చేవారు నోట్లతో ఓట్లు కొనుగోలు చేస్తూ అధికారం కోసం తాపత్రయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, నిస్వార్థంతో ప్రజలకు సేవ చేయాలనుకునే వారు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడుతున్నారని వాపోయారు.
- ఇదీ చూడండి : యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం