ఆర్టీసీకి ఇంకెన్ని రోజులు సాయం చేయాలని ప్రభుత్వం అనడం సిగ్గుచేటని తెజస అధ్యక్షులు కోదండరాం అన్నారు. ఆర్టీసీని నడపడం ప్రభుత్వ బాధ్యత అని... దానిపై పెట్టే ఖర్చులను పెట్టుబడిగా చూడాలని పేర్కొన్నారు. ఆర్టీసీని బతికించుకోవడం కోసం యూనియన్లు సమ్మె చేస్తున్నాయని... సర్కార్ చర్చలు జరిపి ఉంటే సమ్మె ఇంతవరకు వచ్చేది కాదని తెలిపారు. ఇప్పటికైనా కార్మికుల డిమాండ్లపై చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇంకెన్ని రోజులు అనడం సిగ్గుచేటు: కోదండరాం - kodandaram fires on kcr
అనేక లక్ష్యాల సాధన కోసం ఆర్టీసీని నడపడం ప్రభుత్వం బాధ్యతని తెజస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
tjs president kodandaram