Kodandaram letter to CM KCR: సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న తప్పుడు విధానాలతోనే తెలంగాణలో గత ఎనిమిది ఏళ్లల్లో 4 వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. రైతు బంధు పేరిట ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో చేపట్టిన ఆత్మ గౌరవ దీక్ష సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్కు కోదండరాం బహిరంగ లేఖ రాశారు.
ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్కు కోదండరాం బహిరంగ లేఖ - Kodandaram letter
Kodandaram: తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో చేపట్టిన ఆత్మ గౌరవ దీక్ష సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్కు కోదండరాం బహిరంగ లేఖ రాశారు. ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రజలు అధికారం అప్పగిస్తే... వారి కలలను నీరు గారుస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
కోదండరాం
ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రజలు అధికారం అప్పగిస్తే... వారి కలలను నీరు గారుస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం, వారి సన్నిహితులకు 8 ఏళ్లుగా తెలంగాణ వనరులను పరిమితం చేశారని దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని కోదండరాం విమర్శించారు.