రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని ఉద్యోగాల హడావుడి చేస్తోందని ఆరోపించారు.
'ఉద్యోగాల భర్తీ విషయంలో సర్కార్కు చిత్తశుద్ధి లేదు' - tjs president kodandaram on job recruitment
ఎన్నికలు వస్తున్నాయనే సీఎం కేసీఆర్ ఉద్యోగాల హడావుడి చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. జోనల్ వ్యవస్థ లేకుండా.. ఉద్యోగాల భర్తీ చేయలేరని తెలిసిన కేసీఆర్.. దిల్లీకి వెళ్లి కూడా జోనల్ వ్యవస్థ మీద స్పష్టత ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.

దిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థ మీద స్పష్టత ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. జోనల్ వ్యవస్థ లేకుండా ఉద్యోగాల భర్తీ చేయలేరని, పాత జోనల్ వ్యవస్థ ప్రకారం భర్తీ చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 2 నుంచి 8 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. ఉద్యోగాల్లో ఖాళీల సమాచారం తమ వద్ద ఉంచుకుని కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నెలలోపు నోటిఫికేషన్లు ఇచ్చి.. మార్చిలోపు ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి :భాజపా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన బండి సంజయ్