తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది: కోదండరామ్ - రాష్ట్ర ప్రభుత్వంపై తెజస అధ్యక్షుడు కోదండరామ్ విమర్శలు

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని... తెజస అధ్యక్షుడు కోదండరామ్​ అన్నారు. ఎల్​ఆర్​ఎస్​ పేరుతో రియల్​ ఎస్టేట్​ రంగం నడ్డి విరుస్తోందని విమర్శించారు. ప్రభుత్వం విద్యను బలోపేతం చేయాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది: కోదండరామ్
రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది: కోదండరామ్

By

Published : Nov 5, 2020, 2:37 PM IST

తెలంగాణ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెజస అధ్యక్షుడు కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మార్కెట్​ స్తంభించిపోయిందన్నారు. ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్​ పేరుతో రియల్ ఎస్టేట్​ రంగం నడ్డి విరుస్తోందని విమర్శించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారన్న ఆయన... ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్​తోపాటు రూ.7,500 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. వీలైతే రేపు విద్యాశాఖ కార్యదర్శిని కలుస్తామని వెల్లడించారు.

ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందని కోదండరాం ఆరోపించారు. కళాశాలల మాదిరిగా పాఠశాల విద్యార్థులకు కూడా ఫీజు రీయంబర్స్​మెంట్​ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆన్​లైన్​ తరగతులు పరిష్కారం కాదని... అందరికీ విద్య అందించేందుకు నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నారు. వెంటనే విద్యా సంవత్సరం క్యాలెండర్​ను విడుదల చేయాలని కోరారు. పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్నారు... గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో చిన్న, సూక్ష్మ పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని మండి పడ్డారు.

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది: కోదండరామ్

ఇదీ చూడండి:గ్రేటర్​ డబుల్​ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.600 కోట్లు విడుదల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details