తెలంగాణ

telangana

ETV Bharat / city

'వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందక పోవడం దారుణం' - saroornaga news

హైదరాబాద్​లో సరూర్​నగర్​లోని ముంపు ప్రాంతాల్లో తెజస అధ్యక్షుడు కోదండరాం పర్యటించారు. పలు కాలనీలను సందర్శించి... బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవటంపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

tjs leader visited in saroornagar flood effected areas
tjs leader visited in saroornagar flood effected areas

By

Published : Oct 15, 2020, 6:36 PM IST

హైదరాబాద్ సరూర్​నగర్ చెరువు కింద ముంపు ప్రాంతాలను తెజస అధ్యక్షుడు కోదండరాం సందర్శించారు. కోదండరాంనగర్, సీసాల బస్తీ, పీఎన్టీ కాలనీ, కమలానగర్ ప్రాంతాల్లో పర్యటించిన కోదండరాం... వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు.

వరద బాధిత కుటుంబాలకు ఎలాంటి ప్రభుత్వ సాయం అందక పోవడం దారుణమని కోదండరాం మండిపడ్డారు. ఓ అపార్ట్​మెంట్​ సెల్లార్​లోకి వరద నీరు వచ్చి మూడేళ్ల బాలుడు మృతి చెందగా... బాధిత కుటుంబాన్ని అధికారులు కానీ... ప్రజాప్రతినిధులు కానీ.. పలకరించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... తక్షణమే ఆహారం, మంచినీరు, అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశాడు.

ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు

ABOUT THE AUTHOR

...view details