ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో కలిసినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను తెజస అధ్యక్షుడు కోదండరాం ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరినీ కలవలేదని... కలవాల్సిన అవసరమూ లేదని ఉద్ఘాటించారు.
'నేను కేసీఆర్‌ను కలవలేదు... తప్పుడు ప్రచారమన్న కోదండరాం' - tjs leader kodandaram on mlc election polling
సీఎం కేసీఆర్‌ను తాను కలిశానని వస్తున్న వార్తలు అవాస్తవమని తెజస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పట్టభద్రులెవరూ దుష్ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
tjs leader kodandaram reacted on met with cm kcr news
శనివారం రాత్రి తాను హన్మకొండలోనే ఉన్నానని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తన గెలుపును ఓర్వలేని వారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని... పట్టభద్రులెవరూ దుష్ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కోదండరాం తెలిపారు.