న్యాయమైన డిమాండ్లపై భారత్ బంద్ నిర్వహిస్తే... అరెస్టులు చేయించిన తీరు సరైంది కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. భారత్ బంద్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ... హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిపక్షాల సమావేశం నిర్వహించాయి. 10 వేల మందికి పైగా అరెస్ట్ అయినా.. బంద్ విజయవంతం అయ్యిందని కోదండరాం తెలిపారు. ఈ నెల 30న కలెక్టర్లకు విజ్ఞానపన పత్రం ఇవ్వడంతో పాటు... అక్టోబరు 5న పొడు భూముల సమస్యలపై రాస్తారోకో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నిన్న భారత్ బంద్‌లో భాగంగా హయత్‌నగర్ బస్‌డిపో వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌తో సహా వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కోదండరాం అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ కార్యకర్తల ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రగతి భవన్ ప్రవేశం దగ్గరికి రాగా... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెజస కార్యకర్తలను అదుపులోకి తీసుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.