తెలంగాణ

telangana

ETV Bharat / city

నాయిని మరణం.. రాష్ట్ర రాజకీయాలకు పెద్దలోటు: కోదండరాం - nayini narsimhareddy news

తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మరణం రాష్ట్ర రాజకీయాలకు పెద్ద లోటని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. నాయిని మృతిపట్ల తన సంతాపం వ్యక్తం చేశారు.

kodandaram on nayini death
నాయిని మరణం.. రాష్ట్ర రాజకీయాలకు పెద్దలోటు: కోదండరాం

By

Published : Oct 22, 2020, 4:56 PM IST

మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మృతిపట్ల తన సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం. సుదీర్ఘకాలం పాటు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారన్నారు.

సోషలిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. కార్మిక నాయకుడిగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా ఎదిగారని కొనియాడారు. సేవాతత్పరత కలిగిన నాయకుడు మరణించడం తెలంగాణ రాజకీయాలకు పెద్ద లోటన్నారు కోదండరాం.

నాయిని మరణం.. రాష్ట్ర రాజకీయాలకు పెద్దలోటు: కోదండరాం

ఇవీచూడండి:ఉద్యమ నేతకు కన్నీటి నివాళ్లు... నర్సన్నకు అంతిమ వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details