దుబ్బాక ఉపఎన్నికతో పాటు.. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పోటీ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రకటించారు. నాంపల్లిలోని తెజస కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.
దుబ్బాక ఉపఎన్నిక, పట్టభద్రుల ఎన్నికల బరిలో తెజస - ్హవవోకో లాైే
దుబ్బాక ఉపఎన్నిక, పట్టభద్రుల ఎన్నికల బరిలో దిగేందుకు తెజస సిద్ధమైంది. నాంపల్లిలోని తెజస కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దుబ్బాక ఉపఎన్నిక, పట్టభద్రుల ఎన్నికల బరిలో తెజస
రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో పార్టీ నిర్మాణం, దుబ్బాక ఉప ఎన్నికతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానం.. మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి జరగబోయే ఎన్నికలపై చర్చించారు. దుబ్బాక ఉప ఎన్నిక వ్యూహాలు, అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కమిటీని నియమించారు.
ఇవీ చూడండి:దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ