తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైకాపా విజయం సాధించింది. బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి విజయకేతనం ఎగురవేశారు. తాజా సమాచారం మేరకు గురుమూర్తి 2,31,943 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2019లో అధికార వైకాపా అభ్యర్థి సాధించిన 2.28 ఓట్ల మెజారిటీని అధిగమించి వైకాపా విజయతీరాలకు చేరుకుంది. తాజా సమాచారం మేరకు వైకాపాకు 5,37,152 (56.5 శాతం) ఓట్లు పోలయ్యాయి. తెదేపా 3,05,209 (32.1 శాతం), భాజపా 50,739 (5.3 శాతం), కాంగ్రెస్ 8,477(0.9 శాతం), సీపీఎం 5,027 (0.5 శాతం), ఇతరులకు 30,704 (3.2 శాతం) ఓట్లు పోలయ్యాయి. మరో 13,300(1.4 శాతం) మంది ఓటర్లు నోటాను ఎంకుకున్నారు.
తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం - Tirupati Lok Sabha by-election counting
తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి, భాజపా అభ్యర్థి రత్నప్రభపై గెలుపొందారు.
![తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం tirupathi result](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11610413-565-11610413-1619926475239.jpg)
తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యం
Last Updated : May 2, 2021, 4:03 PM IST