తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుపతి ఉప పోరు పోలింగ్ ప్రారంభం - telangana news

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్... రాత్రి 7 గంటల వరకూ సాగనుంది. కరోనా నేపథ్యంలో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున... మొత్తం 2 వేల 470 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు... మే 2న జరగనుంది.

tirupati by poll, tirupati election updates
తిరుపతి ఉపపోరు ప్రారంభం, తిరుపతి ఉప ఎన్నిక ప్రారంభం

By

Published : Apr 17, 2021, 7:27 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట సెగ్మెంట్లలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు, ఇతర పోలింగ్‌ సామగ్రితో... ఎన్నికల సిబ్బంది నిన్న సాయంత్రానికే నిర్దేశిత కేంద్రాలకు చేరుకున్నారు.

ఉపఎన్నికల్లో మొత్తం 17 లక్షల 11 వేల 195 మందికి ఓటు హక్కు ఉండగా... వీరి కోసం 2 వేల 470 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో 15 వందల మందికి ఓ పోలింగ్‌ కేంద్రం ఉండగా... ఈసారి కరోనాదృష్ట్యా వెయ్యి మందికి ఒకటి చొప్పున సిద్ధం చేశారు. భౌతికదూరం పాటిస్తూ ఓటేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని భావించిన ఎన్నికల సంఘం... పోలింగ్‌కు 2 గంటలు అదనపు కేటాయించింది.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.... రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఎండలు తీవ్రంగా ఉన్నందున పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీరు సహా ఇతర సదుపాయాలు కల్పించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించినట్లు అధికారులు ప్రకటించారు. ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి సిరా వేయనున్నట్లు తెలిపారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల పోలింగ్‌ సందర్భంగా... ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం 13 వేల 827 మంది ఏపీ పోలీసులు, 23 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు బందోబస్తులో నిమగ్నమయ్యాయి. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 877 పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల్ని మోహరించారు.

అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 466 పోలింగ్‌ కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అలాగే పోలింగ్‌ కేంద్రంలో ఉంటూ పరిస్థితిని గమనించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించారు. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆ రాష్ట్ర ఈసీ ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించింది. ఏ పార్టీ తరపున ఏజెంట్లుగా పనిచేయడానికీ వీల్లేదని స్పష్టం చేసింది.

'నో యువర్ పోలింగ్ స్టేషన్' యాప్‌ ద్వారా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకునే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఎపిక్ కార్డు నంబర్ ద్వారా పోలింగ్ కేంద్రానికి గూగుల్ నావిగేషన్ పొందే ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి:కీలక ఘట్టానికి సాగర్ పోరు.. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details