తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం జలదిగ్బంధం(Tirupati floods latest news 2021)లో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్ల రాకపోకలకు (train services stopped in tirupati) అంతరాయం ఏర్పడింది. రైళ్లలో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇళ్లల్లో వరద ప్రవాహంతో ముంపుప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో తిరుపతి నగరంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువుల నుంచి వరద నీరు నగరంలోకి వస్తోంది. దీంతో పట్టణంలోని పలు కాలనీల్లో వరద నీరు ఇంకా తొలగలేదు.
ఇంకా జలదిగ్బంధంలోనే...
గాయత్రినగర్, సరస్వతి నగర్, శ్రీకృష్ణనగర్ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముత్యాలరెడ్డిపల్లి, ఉల్లిపట్టెడ, దుర్గానగర్ ప్రాంతాలు నీటలోనే తేలుతున్నాయి. ఆటోనగర్ లోని వెయ్యి కుటుంబాలు గత నాలుగు రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యాయి. పునరావాస కేంద్రాల్లో పెద్ద ఎత్తున బాధితుల చేరుకున్నారు. ఇంకా జలదిగ్బంధంలో పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం (padmavathi university flood)ఉంది.
కాస్త తగ్గుముఖం...పునరుద్ధరణ..