tirumala darshan : శ్రీవారిని ధర్మదర్శనం చేసుకునేందుకు వస్తున్న భక్తులకు 4 గంటల్లోనే స్వామివారి దర్శనం లభిస్తోంది. రద్దీ సాధారణంగా ఉండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారిని మంగళవారం 67,858 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న వేంకటేశ్వరుని హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు.
tirumala darshan : 4 గంటల్లోనే తిరుమల శ్రీవారి దర్శనం
tirumala darshan : తిరుమల వైకుంఠనాథుడిని ధర్మదర్శనం చేసుకునేందుకు వస్తున్న భక్తులకు.. 4 గంటల్లోనే స్వామివారి దర్శనం లభిస్తోంది. రద్దీ సాధారణంగా ఉండడంతో.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
tirumala darshan
తెలంగాణ ఎమ్మెల్సీ సిఫారసు లేఖ ఫోర్జరీ..శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఫోర్జరీ సిఫారసు లేఖ ఇచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన యాదయ్య శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి సిఫారసు లేఖను తీసుకుని తిరుమల అదనపు ఈవో కార్యాలయంలో వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఈనెల 17న దరఖాస్తు చేశాడు. లేఖను పరిశీలించిన కార్యాలయ సిబ్బంది నకిలీదిగా గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- ఇదీ చదవండి :దేవుణ్నీ నిలువు దోపిడీ చేసిన ఆంగ్లేయులు