తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ నెల 19న ఆర్జిత సేవలను రద్దుచేసిన తితిదే - తితిదే తాజా సమాచారం

సూర్యజయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 19న ఏపీలోని తిరుమల శ్రీవారికి ఉత్సవాలు చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమాల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ నెల 19న నిర్వహించనున్ ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.

tirumala-tirupati-devastanam-canceled-the-special-services-on-the-19th-of-this-month
ఈ నెల 19న ఆర్జిత సేవలను రద్దుచేసిన తితిదే

By

Published : Feb 9, 2021, 6:42 PM IST

సూర్యజయంతిని పురస్కరించుకొని ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 19వ తేదీ రథసప్తమి ఉత్సవాన్ని తితిదే వైభవంగా నిర్వహించనుంది. ఆ రోజున తెల్లవారుజామున 5.30 నుంచి ఉదయం 8 గంటల వరకు స్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై దర్శనమివ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 19న నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

సేవల వివరాలు:

ఉ 5.30 - ఉ. 08.00 - సూర్యప్రభ వాహనం

ఉ. 9.00 - ఉ. 10.00 - చిన్నశేష వాహనం

ఉ. 11.00 - మ. 12.00 - గరుడ వాహనం

మ. 1.00 - మ. 2.00 - హనుమంత వాహనం

మ. 2.00 - మ. 3.00 - చక్రస్నానం

సా. 4.00 - సా. 5.00 - కల్పవృక్ష వాహనం

సా. 6.00 - సా. 7.00 -సర్వభూపాల వాహనం

రా. 8.00 - రా. 9.00 -చంద్రప్రభ వాహనం

ఇదీ చదవండి:కొత్త పార్టీలు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్: షబ్బీర్‌ అలీ

ABOUT THE AUTHOR

...view details