తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 22న.. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 25న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆరోజు దర్శనం నిలిపివేస్తారు.
ఈ నెల 22న భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేత - ఈనెల 22న తిరుమల ఆలయం శుద్ధి పనులు
ఈనెల 22న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు.. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపివేయనున్నారు. 25న వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాన్ని శుద్ధి చేస్తారు. ఆ కార్యక్రమం పూర్తైన తరువాత స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
![ఈ నెల 22న భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేత tirumala srivaru darshan timings on 22nd december](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9942418-169-9942418-1608442391432.jpg)
ఈ నెల 22న భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేత
ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం.. నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.