తెలంగాణ

telangana

ETV Bharat / city

24 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు - శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమలలో ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల కారణంగా... మార్చి 24, 25, 26, 27, 28 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వర్చువల్ ‌సేవ), 26, 27, 28 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవాలను తితిదే రద్దు చేసింది.

tirumala-salakatla-teppotsavam-starts-for-march-24
24 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

By

Published : Mar 11, 2021, 12:43 PM IST

తిరుమలలో ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఈ వేడుక నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ సీతారామచంద్రమూర్తి, రెండోరోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు తిరుమాఢవీధుల్లో ప్రదక్షిణగా విహరించి.. చివరికి పుష్కరిణిలో తెప్పపై విహరిస్తారు.

చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తెప్పపై విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా ఈనెల 24, 25, 26, 27, 28 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వర్చువల్‌ సేవ), 26, 27, 28 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవాలను తితిదే రద్దుచేసింది.

ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details