తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని కోరుతూ.. వివిధ ప్రాంతాల భక్తులు తిరుపతి గరుడ కూడలిలో ఆందోళనకు దిగారు. ముందస్తు ప్రకటనలు లేకుండా టోకెన్లు జారీ చేయడాన్ని భక్తులు తప్పుపట్టారు. దూరప్రాంతాల భక్తులు శ్రీవారిని దర్శించుకోకుండా వెనుదిరగాల్సి వస్తోందని నినాదాలు చేశారు. తితిదే ధర్మకర్తల మండలి కలుగజేసుకొని సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీపై భక్తుల నిరసన - తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీపై నిరసన
ముందస్తు ప్రకటన లేకుండా శ్రీవారి సర్వదర్శన టోకెన్లు జారీ చేయడంపై భక్తులు ఆందోళనకు దిగారు. తిరుపతిలోని గరుడ కూడలిలో బైఠాయించి.. నిరసన తెలిపారు. దూర ప్రాంతాల భక్తులు.. దర్శన భాగ్యం కలుగకుండానే వెళ్లిపోవాల్సి వస్తోందని మండిపడ్డారు.
tirumala
పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న తితిదే.. ఈ నెల 24 వరకు సరిపడా సర్వదర్శన టోకెన్లను మూడు రోజులు ముందుగానే జారీ చేసింది. అనంతరం ఆ టోకెన్లు ఇచ్చే కేంద్రాలను మూసివేసివేయడం భక్తల ఆగ్రహానికి కారణమైంది.