తెలంగాణ

telangana

ETV Bharat / city

2లక్షల శ్రీవారి లడ్డూలు సిబ్బందికి ఉచితంగా పంచారు - tirumala laddu free news

కరోనా వ్యాప్తితో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. భక్తుల కోసం సిద్ధం చేసిన లడ్డూ నిల్వలు పేరుకుపోయాయి. వాటిని ఉగాది కానుకగా సిబ్బందికి ఉచితంగా పంపిణీ చేశారు.

tirumala laddu
tirumala laddu

By

Published : Mar 21, 2020, 4:01 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో.. ముందు జాగ్రత్త చర్యగా తిరుమలలో దర్శనాలు నిలిపివేశారు. ఈ కారణంగా.. తిరుమల గిరులు ఖాళీ అయ్యాయి. శ్రీవారి భక్తుల కోసం సిద్ధం చేసిన లడ్డూ నిల్వలు పేరుకుపోయాయి. దాదాపు 2 లక్షల లడ్డూలు అలాగే ఉండిపోయాయి.

ఈ లడ్డూలన్నీ తితిదే సిబ్బందికి ఉగాది కానుకగా ఇవ్వాలని పాలకమండలి నిర్ణయించింది. ప్రత్యేక వాహనాల్లో లడ్డూ ప్రసాదాన్ని తరలించి మరీ.. సిబ్బందికి ఉగాది కానుకగా శ్రీవారి ప్రసాదాన్ని పంపిణీ చేసింది.

2లక్షల శ్రీవారి లడ్డూలు సిబ్బందికి ఉచితంగా పంచారు

ABOUT THE AUTHOR

...view details