Tirumala Boy Kidnap Case : రెండు రోజుల క్రితం తిరుమల ఆలయం ఎదుట కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళ తల్లిదండ్రులు తిరుమల విజిలెన్స్ అధికారులకు అతణ్ని అప్పగించారు. తమ కుమార్తె పవిత్రకు మతిస్థిమితం లేదని.. అందుకే బాలుడిని తీసుకెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం తిరుమల కమాండ్ కంట్రోల్ రూమ్‌లో చిన్నారిని క్షేమంగా ఉంచారు. తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం - Tirumala Boy Kidnap Case
Tirumala Boy Kidnap Case : తిరుమల ఆలయంలో కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. తిరుమల కమాండ్ కంట్రోల్ రూమ్‌లో చిన్నారి క్షేమంగా ఉన్నాడు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నెల 3న తిరుమల అఖిలాండం వద్ద బాలుడు అపహరణకు గురయ్యాడు.
kidnapped boy safe
మే 3న బాలుడిని ఎత్తుకెళ్లిన నిందితురాలు పవిత్ర మైసూర్‌లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లింది. ఎందుకు తీసుకొచ్చావని వారు ప్రశ్నించారు. అనంతరం తిరుమలకు వచ్చి బాలుడిని తితిదే విజిలెన్స్‌కు పోలీసులకు వారు అప్పగించారు. మతిస్థిమితం లేక బాలుడిని తమ కూతురు తీసుకొచ్చిందని పోలీసులకు కిడ్నాపర్ పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు.
ఇదీ చదవండి:Rape in mamidikuduru: వైద్యం చేసేందుకు వచ్చి.. డాబాపై నిద్రిస్తున్న బాలికపై..