తెలంగాణ

telangana

ETV Bharat / city

కల్పవృక్ష వాహనంపై తిరుచానూరు పద్మావతి అమ్మవారు - తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారికి కల్పవృక్ష వాహన సేవ జరిగింది. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు వాహన మండపంలో ఈ సేవ ఏకాంతంగా జరిగింది.

కల్పవృక్ష వాహనంపై తిరుచానూరు పద్మావతి అమ్మవారు
కల్పవృక్ష వాహనంపై తిరుచానూరు పద్మావతి అమ్మవారు

By

Published : Nov 14, 2020, 5:04 PM IST

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు కల్పవృక్ష వాహన సేవ జరిగింది. గోకుల కృష్ణుని అలంకారంలో ఆవు, దూడతో అమ్మవారు దర్శనమిచ్చారు. కరోనా కారణంగా ఆల‌యం వ‌ద్ద‌ గ‌ల వాహ‌న మండ‌పంలో పద్మావతి దేవి వాహ‌న‌ సేవ ఏకాంతంగా జ‌రిగింది.

పాల కడలిని అమృతం కోసం మధించిన వేళ లక్ష్మీదేవి తోబుట్టువైన కల్పవృక్ష వాహనంపై అమ్మవారిని దర్శించుకుంటే... ఆకలిదప్పులు నశించి, పూర్వజన్మ స్మరణ లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఇవీ చదవండి: ఈనెల 20 నుంచి తుంగభద్ర నది పుష్కరాలు

ABOUT THE AUTHOR

...view details