తెలంగాణ

telangana

ETV Bharat / city

సృజనాత్మకంగా ఆలోచించాలంటే.. ఇవి పాటించాల్సిందే! - creativity tips

అందరూ కష్టపడే పనిచేస్తారు. కానీ సరికొత్తగా ఆలోచించే కొందరే లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అలా సృజనాత్మకంగా ఆలోచించాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే...

creativity
creativity

By

Published : Apr 3, 2021, 9:16 AM IST

పని మీద ఆసక్తి ఉండాలి :

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రంగమంటే ఇష్టం ఉంటుంది కదా. మీ అభిరుచికి అద్దంపట్టే రంగాన్నే ఎంచుకుంటే ఎంతటి కష్టాన్నయినా ఇష్టంగా భరించగలుగుతారు. అప్పుడు పనిని మొక్కుబడిగా కాకుండా ఎంతో ఆసక్తిగా చేస్తారు.

చదవాలి :

మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన పుస్తకాలను చదువుతుండాలి. దాంట్లోని ముఖ్యమైన విషయాలను ఒకచోట రాసుకోవాలి. వాటి మీద మరింత విస్తృతంగా ఆలోచిస్తే మీకూ సరికొత్త ఆలోచనలు రావచ్చు. మీకు ఆసక్తి ఉన్న విషయం మీద అంతర్జాలంలో ఎంతో సమాచారం అందుబాటులో ఉంటుంది. సమయం చిక్కినప్పుడల్లా దాన్ని చదవాలి. అలాగే సృజనాత్మకంగా ఆలోచించడానికి పుస్తక పఠనమూ ఎంతగానో తోడ్పడుతుంది.

వినాలి :

వివిధ విషయాల మీద ప్రముఖుల అభిప్రాయాలను వింటుండాలి. అవి మీ ఆలోచనా పరిధిని మరింతగా విస్తరించడానికి ఎంతగానో తోడ్పడతాయి. వర్క్‌షాప్‌లు, సెమినార్లకూ హాజరుకావడం ద్వారా నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. మేధోమధనం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. అలాగే విని ఊరుకోవడమే కాదు... ఒక విషయం మీద మాట్లాడటమూ అలవాటు చేసుకోవాలి.

ఇంకా ఏం చేయాలంటే :

మెదడును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. లక్ష్యాల మీదే దృష్టిని కేంద్రీకరించాలి. బాధాకరమైన విషయాలను ఎప్పటికప్పుడు మర్చిపోవాలి. శారీరకంగా, మానసికంగా తగిన విశ్రాంతి తీసుకుంటే.. సరికొత్తగా ఆలోచిస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.

కొత్తగా ఆలోచించాలి :

కొత్త ఆలోచనలన్నీ గొప్పవాళ్లకే వస్తాయని అపోహ పడుతుంటారు చాలామంది. కానీ ప్రతి ఒక్కరికీ చక్కని ఆలోచనలు వస్తాయి. మీ అభిరుచులకు అద్దంపట్టే రంగాన్నే ఎంచుకుంటే ఇష్టంగా, సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు.

ABOUT THE AUTHOR

...view details