హైదరాబాద్ కూకట్పల్లి-హైటెక్ సిటీ మార్గంలో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తుండగా... అదుపు తప్పి మలేసియా టౌన్‌షిప్‌కు ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. 10 మీటర్ల మేర డివైడర్ ధ్వంసం అయ్యింది. రాత్రి సమయం కావటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గంలో అనుమతులకు విరుద్దంగా నడుస్తున్న టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా... స్పందన కరువైందని వాపోయారు.
డివైడర్‌ను ఢీ కొట్టిన టిప్పర్... తప్పిన ప్రమాదం - tipper hulchal devider damaged
టిప్పర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటన కూకట్పల్లి-హైటెక్‌సిటీ మార్గంలో చోటుచేసుకుంది. ప్రమాదం రాత్రి సమయం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

డివైడర్‌ను ఢీ కొట్టిన టిప్పర్... తప్పిన ప్రమాదం