దక్షిణ మధ్య రైల్వే ఈనెల 9 వరకు 35 శ్రామిక్ రైళ్లను నడిపిందని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్ల ద్వారా సుమారు 39 వేల వలస కూలీలను స్వస్థలాలకు తరలించినట్లు పేర్కొన్నారు. బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూలీలను దశల వారీగా రైళ్ల ద్వారా తరలివెళ్లారని తెలిపింది.
41 వేల మంది ద.మ రైల్వే ద్వారానే...
ఇక మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి సుమారు 1100 మంది, బీహార్ రాష్ట్రంలోని కగారియా ప్రాంతానికి చెందిన సుమారు 220 మంది హమాలీలు, కూలీలు తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లలో తరలివచ్చారని వెల్లడించారు. మొత్తంగా ఇప్పటి వరకు సుమారు 41వేల కూలీలు ద.మ రైల్వే ద్వారా రాకపోకలు సాగించారని తెలిపారు. కూలీలను తరలించే క్రమంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో, రైళ్లలో సానిటైజేషన్ చేస్తూ... భౌతికదూరం పాటిస్తూ... మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూలీలకు మంచినీళ్లు, ఆహారం కూడా అందజేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : తొర్రూర్ మున్సిపాలిటీలో మంత్రి పర్యటన