Security at Telangana Assembly : శాసనసభ సమావేశాల సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర బహిర్గతం కావడంతో ప్రభుత్వం పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. పోలీసులు సుమారు 2,500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
Security at Telangana Assembly : అసెంబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తు - తెలంగాణ అసెంబ్లీ వద్ద సెక్యూరిటీ
Security at Telangana Assembly : శాసనసభ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర బహిర్గతం కావడంతో ప్రభుత్వం.. పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Security at Telangana Assembly
Telangana Assembly Sessions : శాసనసభకు సందర్శకుల రాకపై ఆంక్షలు విధించారు. సభ లాబీలో మంత్రులు, ఎమ్మెల్యేలు మినహా ఇతరులెవరినీ అనుమతించరు. గన్‌పార్క్ చుట్టూ ఫెన్సింగ్ అమర్చారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నగరవ్యాప్తంగా నిఘా మరింత పెంచారు. ధర్నాచౌక్ చుట్టూ 2 కి.మీ. పరిధిలో సభలు, ఆందోళనలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.