Tiger wandering in Villages: ఏపీలోని కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచరిస్తోంది. ఈ వార్త స్థానికులను కలవరపెడుతోంది. ప్రత్తిపాడు మండలంలో రాత్రివేళ పశువులపై దాడి చేస్తూ.. నీరు తాగేందుకు స్థానికంగా ఉన్న కాల్వల వద్దకు వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇదే పులి ఒమ్మంగి, పోతులూరు, పొదురుపాక, శరభవరం, ధర్మవరం గ్రామాల్లో పశువులపై దాడి చేసి ఆరు గేదెల్ని చంపేసిందని అధికారులు తెలిపారు. దీంతో పులిని బంధించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
Tiger wandering in Villages: పెద్దపులి కలవరం.. బంధించేందుకు అటవీశాఖ యత్నం - పెద్దపులి సంచారం
Tiger wandering in Villages: ఏపీలోని కాకినాడ జిల్లా ప్రజలు పెద్దపులి పేరు చెబితేనే కలవరంతో పరుగులు పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ పులి సంచరిస్తోంది. రాత్రిళ్లు పశువులపై దాడి చేస్తూ.. నీటి కోసం కాల్వల వద్దకు వస్తోందని అటవీ అధికారులు గుర్తించారు. దీంతో పులిని బంధించేందుకు సిబ్బందిని రంగంలోకి దించారు.
పులిని బంధించే చర్యల్లో భాగంగా.. పోతులూరు వద్ద స్థానిక సర్పంచ్‌లతో అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. పులిని బంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్ర సమయానికి అది సంచరించే ప్రాంతాలకు బోన్లను తరలించనున్నారు. పులిని పట్టుకోవడానికి 120 మంది అటవీ సిబ్బందికి ప్రత్యేకంగా విధులు కేటాయించారు. అటవీశాఖ ముఖ్య అధికారి శరవణన్ ఆధ్వర్యంలో పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు పులిని బంధించేందుకు సుమారు వారం రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. మరి పోలీసుల బోనుకు పులి చిక్కుతుందా.. లేక అడవిలోకి తిరిగి వెళ్తుందా చూడాలి.
ఇవీ చదవండి :