తెలంగాణ

telangana

ETV Bharat / city

పులి కోసం వేట.. రంగంలోకి 150 మంది.. 40 సీసీ కెమెరాలు!

Tiger roaming in ratipada zone: ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పరిధిలో సంచరిస్తున్న పులిని బంధించేందుకు.. అటవీశాఖ చర్యలు వేగవంతం చేసింది. డీఈవో ఐకేవీ రాజు ఆధ్వర్యంలో 150 మంది గస్తీ కాస్తున్నారు. పులి జాడకోసం 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Tiger roaming in ratipada zone
పులి కోసం వేట

By

Published : May 30, 2022, 9:12 PM IST

Tiger roaming in ratipada zone: ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పులిని బంధించేందుకు.. అటవీశాఖ చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. డీఈవో ఐకేవీ రాజు ఆధ్వర్యంలో 150 మంది గస్తీ కాస్తున్నారు. కాగా.. పులి సంచరిస్తున్న దృశ్యాలు ఆదివారం మరోసారి సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పోతులూరు సమీపంలో 80 అడుగుల గుట్టపై పులి సంచారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పులిని బందించేందుకు మూడు బోన్లను అటవీశాఖ అధికారులు సిద్ధం చేశారు. సరుగుడు పొలాల నుంచి బోన్లు తరలిస్తున్నారు. విశాఖ జంతు ప్రదర్శనశాల అధికారులూ.. పులిని బంధించేందుకు చేపట్టిన చర్యల్లో పాల్గొంటున్నారు. పులి జాడ కోసం 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకోవడానికి చర్యలు చేపట్టామని.. వదంతులు నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details