తెలంగాణ

telangana

ETV Bharat / city

సుల్తానా మమ్మల్నే బూతులు తిట్టింది.. తుంబే ఆస్పత్రి యాజమాన్యం క్లారిటీ - తెలంగాణలో కరోనా ప్రభావంట

వైద్యురాలి నిర్బంధం ఆరోపణలపై తుంబే ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. ఫీవర్‌ ఆస్పత్రి వైద్యురాలు సుల్తానా.... ఈనెల 1న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి సిబ్బందితో గొడవపడ్డారని, అసభ్య పదజాలంతో దూషించేవారని అయినా ఆమెకు కొవిడ్‌ చికిత్స కోసం సహకరించినట్లు తెలిపింది. ఈ తెల్లవారుజామున సుల్తానా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని వివరించింది. వైద్యురాలి నిర్బంధంపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చాదర్​ఘాట్​ పోలీసులు తెలిపారు.

thumbey hospital
సుల్తానా మమ్మల్నే బూతులు తిట్టింది.. తుంబే ఆస్పత్రి యాజమాన్యం క్లారిటీ

By

Published : Jul 5, 2020, 4:16 PM IST

ఫీవర్ ఆస్పత్రి డీఎంవో సుల్తానాను ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం నిర్బంధించింది. ఫీవర్ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ అయిన సుల్తానాకు... పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స నిమిత్తం ఆమె చాదర్​ఘాట్​లోని తుంబె ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో రోజుకు ఏకంగా రూ.1.15 లక్షల బిల్లు వేసినట్లు సుల్తానా సెల్ఫీ వీడియోలో వెల్లడించారు.

'' కరోనాతో నేను చాదర్​ఘాట్​లోని తుంబె ఆస్పత్రిలో చేరాను. ఈ యాజమాన్యం ఒక్క రోజుకు లక్షా 15వేల రూపాయల బిల్లు వేశారు. నా సోదరుడు ఇద్దరికి కలిపి రూ.1.9 లక్షలు కట్టాడు. డిశ్చార్జ్ చేయమని అడిగితే వాళ్లు మమ్మల్ని నిర్బంధించారు. మాతో సరిగా ప్రవర్తించడంలేదు. సరైన చికిత్స అందిచట్లేదు. మందులు సైతం సమయానికి ఇవ్వకుండా... ఆహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.''

-సుల్తానా, ఫీవర్ ఆస్పత్రి డీఎంవో

నా కూతురు, సోదరి, సోదరుడు సైతం కోవిడ్ బారిన పడ్డామని సుల్తానా వెల్లడించారు. రోజుకు లక్ష కట్టడం తమ వల్ల కాదని... తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుల్తానా మమ్మల్నే బూతులు తిట్టింది.. తుంబే ఆస్పత్రి యాజమాన్యం క్లారిటీ

తమ సిబ్బందితో సుల్తానా గొడవపడ్డారు

వైద్యురాలి నిర్బంధం ఆరోపణలపై తుంబే ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. వైద్యురాలు సుల్తానా ఈనెల 1న తమ ఆస్పత్రిలో చేరారని తెలిపింది. చేరినప్పటి నుంచి సిబ్బందితో సుల్తానా గొడవపడ్డారని ఆరోపించారు. కొన్నిసార్లు అసభ్య పదజాలంతో దూషించేవారని తెలిపారు. ఆమెకు వైద్యం అందించేందుకు నర్సింగ్‌ సిబ్బంది నిరాకరించినా.. కొవిడ్​ చికిత్స అందించినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఈ తెల్లవారు జామునే సుల్తానా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని వెల్లడించింది.

ఫీవర్​ ఆస్పత్రి స్పందన..

సుల్తానా... తమ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌గా పనిచేస్తున్నారని ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శంకర్‌ వెల్లడించారు. కరోనా పరీక్షల్లో సుల్తానాకు పాజిటివ్‌గా తేలిందన్నారు. ఫీవర్​ ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పకుండానే ప్రైవేటు ఆస్పత్రిలో చేరారని తెలిపారు. సమాచారం ఇస్తే మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకునే వాళ్లమని సూపరింటెండెంట్‌ వివరణ ఇచ్చారు.

ఎటువంటి ఫిర్యాదు అందలేదు..

ఫీవర్​ ఆస్పత్రిలో వైద్యురాలి నిర్బంధంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని చాదర్‌ఘాట్‌ పోలీసులు వెల్లడించారు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు సుల్తానా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారని తెలిపారు.

ఇవీచూడండి:ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవోను నిర్బంధించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం

ABOUT THE AUTHOR

...view details