Building sagged: ఆంధ్రప్రదేశ్లోని కడప కో-ఆపరేటివ్ కాలనీలో కాలం చెల్లిన మూడంతస్తుల భవనం కుంగిపోయింది. అందులోని ప్రజలు సకాలంలో భవనం నుంచి బయటికి రావడంతో ప్రాణాపాయం తప్పింది. భవనానికి మరమ్మతు పనుల్లో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్లో పనులు జరుగుతున్నాయి. మిగిలిన రెండు అంతస్తులలో కొందరు నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భవనం కిందకు కుంగిపోయింది.
కుంగిన మూడంతస్తుల భవనం.. అందులోని వారంతా..! - ఏపీ తాజా వార్తలు
Building sagged: ఏపీలోని కడపలో మూడంతస్తుల భవనం కుంగిపోయింది. భవనంలో ఉన్నవారు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఎలా జరిగిందంటే..?

Building sagged
అప్రమత్తమైన స్థానికులు భవనంలో నుంచి చాకచక్యంగా బయటికి వచ్చారు. మొదటి అంతస్తులో ఉన్న వారు బయటకు వచ్చేందుకు వీలుకాకపోవడంతో వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మొదటి అంతస్తులో ఇరుక్కుపోయిన కుటుంబాన్ని రక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: