తెలంగాణ

telangana

ETV Bharat / city

Building collapse Kadapa : కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. తల్లీబిడ్డ సేఫ్ - తెలంగాణ వార్తలు

ఏపీలోని కడప నగరంలోని మూడంతస్తుల భవనం(Building collapse in Kadapa) కప్పకూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న తల్లీబిడ్డ సేఫ్​గా ఉన్నారు. బాధితులను శిథిలాల నుంచి అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Building collapse in kadapa, Building collapse News
కుప్పకూలిన మూడంతస్తుల భవనం

By

Published : Nov 21, 2021, 8:49 AM IST

ఆంధ్రప్రదేశ్​లో భారీ వర్షాలు, వరద ప్రవాహాలు తీవ్ర విషాదం నింపుతున్నాయి.కడప నగరంలోని రమేష్ థియేటర్ సమీపంలో రాధాకృష్ణ నగర్​లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది(Building collapse Kadapa). ఈ ఘటనలో ఎవరికి ఏలాంటి ప్రాణాపాయం కలగలేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష మేర ఆస్తి నష్టం వాటిల్లింది.

తెల్లవారు జామున ప్రమాదం..

రాధాకృష్ణ నగర్​లోని పాత భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో రాజా రమేష్ మెస్ నిర్వహిస్తున్నారు. మొదటి అంతస్తులో వరలక్ష్మి ఆమె పిల్లలు ఉంటున్నారు. రెండో అంతస్తులో గౌసియా, షఫీ అనే భార్య భర్తలు జీవిస్తున్నారు. వీరందరూ మూడు నెలల క్రితమే ఈ భవనంలోకి వచ్చారు. వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇవాళ తెల్లవారు జామున మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. శబ్దాలు రావడంతో రెండో అంతస్తులో ఉన్న భార్యాభర్తలు, మొదటి అంతస్తులో ఉన్న వరలక్ష్మి బయటికి పరుగులు తీశారు. కానీ వరలక్ష్మి కుమార్తె చంద్రిక, ఆమె బిడ్డ గదిలో చిక్కుకపోయారు. ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు గమనించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని కిటికీలను యంత్రాలతో కోసి ... మొదటి అంతస్తులోని ఓ గదిలో చిక్కుకున్న చంద్రిక ఆమె బిడ్డను రక్షించారు. నగరపాలక అధికారులు మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ భవన యజమాని పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ఏపీలో వరద బీభత్సం

ఏపీలోని కడప జిల్లాలో వరద పోటు(Andhra Pradesh floods 2021) 12 మందిని బలిగొంది. రాజంపేట మండలం నందలూరు వెళుతున్న మూడు ఆర్టీసీ బస్సులు... వరదనీటిలో చిక్కుకు పోయాయి. నందలూరు సమీపంలో ఉదయం నుంచి వరదలోనే ఉన్న ఆర్టీసీ బస్సుల్లోని సిబ్బంది, కొందరు ప్రయాణికులు.... ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయారు. భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం సంభవించింది.నందలూరు పరివాహన ప్రాంతాల్లోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతాల్లో 3 ఆర్టీసీ బస్సులు వరద ఉద్ధృతిలో చిక్కుకుని కొట్టుకుని పోయిన ఘటనలో 30 మంది గల్లంతయ్యారు. వారిలో ఇప్పటి వరకు 12 మంది మృత దేహాలు లభ్యమయయ్యాయి. ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన సహాయక సిబ్బంది, అధికారులు మృతదేహాలను వెలికి తీశారు. గండ్లూరులో 7, రాయవరంలో 3, మండపల్లిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరిని ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన కండట్కర్ అహోబిలం, చిట్వేలికి చెందిన శ్రీనుగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సుల్లోని కొందరిని మాత్రం అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details