ఏపీలోని అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం తాటి తోట గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. రహదారి పక్కన మూడు నాగు పాములు సయ్యాట ఆడటాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. బుసలు కొడుతున్న మూడు పాములు గంటకుపైగా పెనవేసుకున్నాయి.
Snakes dancing: పాముల సయ్యాట..వీడియో వైరల్! - నాగు పాముల సయ్యాట
సాధారణంగా మనం రెండు పాములు పెనవేసుకొని ఉండటాన్ని చూసి ఉంటాం.. కానీ మూడు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని నాట్యమాడటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ అరుదైన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం తాటి గ్రామంలో చోటుచేసుకొంది.
పాముల సయ్యాట..వీడియో వైరల్!
సాధారణంగా రెండు సర్పాలు పెనవేసుకోవడం చూశాం గానీ. ఇలా మూడు పాములు ఒకే చోట సయ్యాట ఆడటం మొదటిసారిగా చూస్తున్నామని స్థానికులు పేర్కొన్నారు.
ఇవీచూడండి:మహిళకు ఒకే కాన్పులో 10 మంది పిల్లలు