తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉపాధ్యాయిని కుటుంబాన్ని బలిగొన్న మహమ్మారి - AP Latest News

కరోనా మహమ్మారి.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. పెద్దలను బలితీసుకొని.. చిన్నారుల భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తోంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయిని ఇంట్లో మహమ్మారి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Three deaths in a year due to corona
ఉపాధ్యాయిని కుటుంబాన్ని బలికొన్న కరోనా

By

Published : May 9, 2021, 10:07 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయిని కుంటుంబంలో ఏడాది కాలంలోనే ముగ్గురు పెద్దలను మహమ్మారి బలిగొంది. కవల పిల్లలను అనాథలను చేసింది.

తాళ్లకట్టుపల్లికి చెందిన నాగదుర్గ కుక్కునూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. ఆమె భర్త రమేశ్‌ గ్రామ సచివాలయ ఉద్యోగి. వీరికి పెళ్లైన చాలా ఏళ్లకు కవలలు నిఖిల్‌, నిహాల్‌ పుట్టారు. గతేడాది రమేశ్‌ తల్లి కరోనాతో మరణించింది. తర్వాత నాలుగు రోజులకే రమేశ్‌ను కూడా మహమ్మారి కాటేసింది. అత్త, భర్త మృతితో కలత చెందిన నాగదుర్గ బుట్టాయగూడెం నుంచి కుక్కునూరుకు మకాం మార్చి ఇక్కడే ఉంటున్నారు. పిల్లలిద్దరూ ఒకటో తరగతి చదువుతున్నారు. ఇటీవల నాగదుర్గ కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు.

ఇదీ చదవండీ... కొవిడ్ టీకా రెండో డోస్ కోసం ప్రజల ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details