తెలంగాణ

telangana

ETV Bharat / city

దక్షిణ మధ్య రైల్వేకు బీఈఈ పురస్కారాలు - బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ

జాతీయ ఇంధన కన్జర్వేషన్ పురస్కారాల్లో దక్షిణ మధ్య రైల్వేకు పలు అవార్డులు వరించాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ), భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిఏటా పురస్కారాలు అందజేస్తోంది.

three Bureau of Energy Efficiency Awards for South Central Railway
దక్షిణ మధ్య రైల్వేకు బీఈఈ పురస్కారాలు

By

Published : Jan 11, 2021, 8:34 PM IST

జాతీయ ఇంధన కన్జర్వేషన్ పురస్కారాల్లో దక్షిణ మధ్య రైల్వేకు మూడు అవార్డులు లభించాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(బీఈఈ), భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిఏడు వివిధ రంగాల్లో సంప్రదాయ శక్తి, ఇంధనం సమర్థంగా పొదుపు చేసే సంస్థలకు జాతీయ శక్తి, ఇంధన పరిరక్షణ పురస్కారాలు అందజేస్తాయి.

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది అవార్డుల పంపిణీ కార్యక్రమం వర్చువల్ విధానంలో నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డీజిల్ లోకో షెడ్​కు మొదటి బహుమతి, లేఖ భవన్(ఎస్​సీఆర్ అకౌంట్స్ భవన్​ ప్రభుత్వ భవనాల)కు ద్వితీయ పురస్కారం, ద.మ. రైల్వే జోన్ రవాణా రంగంలో మెరిట్​ సర్టిఫికెట్​ను కైవసం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details