తెలంగాణ

telangana

ETV Bharat / city

నన్ను సస్పెండ్ చేస్తే.. రోజుకొకరి బండారం బయట పెడతా: జగ్గారెడ్డి - Jaggareddy fires on revanth reddy

jaggareddy
jaggareddy

By

Published : Mar 20, 2022, 2:30 PM IST

Updated : Mar 20, 2022, 3:22 PM IST

14:29 March 20

నన్ను సస్పెండ్ చేస్తే.. రోజుకొకరి బండారం బయట పెడతా: జగ్గారెడ్డి

పార్టీ షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం చెబుతానని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తనను సస్పెండ్ చేస్తే.. రోజుకొకరి బండారం బయట పెడతానని హెచ్చరించారు. సస్పెండ్ చేసినా అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటానని తెలిపారు. జగ్గారెడ్డితో ఏఐసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, మానవతారాయ్, బెల్లయ్య నాయక్ భేటీ అయ్యారు. పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని... పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిని ఏకరువు పెట్టారు.

ఓడితే ఇద్దరం జీరోలమే

రేవంత్ తన సవాలు స్వీకరిస్తే తాను రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలో అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటే రేవంత్ హీరో అని ఒప్పుకుంటానని చెప్పారు. గెలిస్తే తాను హీరో, ఇద్దరం ఓడితే ఇద్దరం జీరోలమే అని తెలిపారు. పార్టీ సిద్ధాంతంలో రేవంత్‌రెడ్డి పని చేయడం లేదని ఆరోపించారు. తన కుటుంబ సమస్యపై మంత్రి హరీశ్‌రావును వీహెచ్‌ కలిస్తే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

అశోక హోటల్​లో సీనియర్ల భేటీ

లక్డీకాపూల్​లోని అశోక హోటల్​లో కాంగ్రెస్‌ సీనియర్ నేతలంతా భేటీ కావాలని వీహెచ్‌, జగ్గారెడ్డి నిర్ణయించారు. అయితే ఈ సమావేశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్​గా పరిగణించింది. పార్టీ సూచనలకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించవద్దని హెచ్చరించింది. వీహెచ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలకు బోసురాజు ఫోన్‌ చేసి సమస్యలుంటే అధిష్ఠానం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. అయినా వీహెచ్, జగ్గారెడ్డి, మర్రి శశిధర్​ రెడ్డి సమావేశమయ్యారు.

ఈ సమావేశం మా వ్యక్తిగతం

సమావేశం వద్దకు ఏఐసీసీ అధికార ప్రతినిధులు మానవతారాయ్, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్‌ వెళ్లారు. అయితే ముగ్గురిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని జగ్గారెడ్డి సూచించారు. దీంతో వాళ్లు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాము పార్టీని ఏ విధంగానూ వ్యతిరేకించడం లేదని జగ్గారెడ్డి అన్నారు. ఈ సమావేశం పూర్తిగా తమ వ్యక్తిగతమని స్పష్టం చేశారు. మిగతా నేతలు ఎందుకు రాలేదో తమకు తెలియదని అన్నారు. సోనియా, రాహుల్‌గాంధీ ఆదేశాలను పాటిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :'హలో తమ్ముడూ'.. అంటూ రేవంత్‌కు జగ్గారెడ్డి పలకరింపు

Last Updated : Mar 20, 2022, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details