ఇన్‌స్టాగ్రామ్(instagram) షాకింగ్ నిర్ణయం తీసుకువస్తున్నట్లు సమాచారం. ఫేక్ ఖాతాలు భారీగా క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో... ఆ సమస్యకు చెక్ పెట్టేందుకే ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా కన్సల్టెంట్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరవాలంటే ఆ వీడియో తప్పనిసరి..! - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్
ఫేక్ ఖాతాలు భారీగా క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్(instagram) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు మరో కొత్త ఫీచర్‌ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.
![ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరవాలంటే ఆ వీడియో తప్పనిసరి..! instagram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13668434-741-13668434-1637229180579.jpg)
instagram
ఇకపై కొత్తగా ఇన్‌స్టా ఖాతా తెరవాలనుకున్నవారు.. తమ సెల్ఫీ వీడియోను(selfie video) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్ర ట్వీట్ చేశారు. ఈ ఫీచర్‌పై అవగాహన కల్పించేందుకు ఇన్‌స్టాగ్రామ్ కొంతకాలం నుంచే పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:అంతరిక్షం నుంచి నట్టింటి దాకా.. ఈ ఆవిష్కరణలెంతో ప్రత్యేకం!