వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చునని ఎల్బీ నగర్ ట్రాఫిక్ అడిషనల్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు చెప్పారు. 31వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు.
'వెనక కూర్చున్నా హెల్మెట్ ఉండాల్సిందే..' - వాహనం వెనక కూర్చునే వారూ శిరస్త్రాణం ధరించాలి
వాహన చోదకులే కాదు... వెనక కూర్చున్న వారూ శిరస్త్రాణం ధరించాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ అడిషనల్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... ధరించిన ద్విచక్ర వాహనదారులకు లీటర్ పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేశారు.
Awairness on Helmet
మూడురోజులుగా రహదారి వారోత్సవాలను వివిధ రూపాలుగా నిర్వహిస్తున్నామని... వాహన చోదకులే కాకుండా... వారి వెనక కూర్చునే వారు సైతం శిరస్త్రాణం ధరించాలని నాగమల్లు పేర్కొన్నారు. ద్విచక్ర వాహనంపై హెల్మెట్లు పెట్టుకొని వచ్చిన ఇద్దరు వాహనదారులకు పూలదండ వేసి... ఉచిత పెట్రోల్ కూపన్లు అందించారు.
ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..