తెలంగాణ

telangana

ETV Bharat / city

ఖైరతాబాద్​ గణేశ్​ ఈసారి ఏ రూపంలో దర్శనమిస్తాడో తెలుసా?

ప్రతిఏటా భారీ ఖాయంతో దర్శనమిచ్చే ఖైరతాబాద్​ గణేశునిపై కరోనా ప్రభావం పడింది. ఈసారి ధన్వంతరి నారాయణ మహాగణపతి రూపంలో కేవలం 9 అడుగుల ప్రతిమను ప్రతిష్ఠించనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. దర్శనానికి భక్తులు ఎవ్వరూ రావద్దని తెలిపింది.

this year 9 feet hight kairathabad ganesh
this year 9 feet hight kairathabad ganesh

By

Published : Aug 5, 2020, 1:20 PM IST

Updated : Aug 5, 2020, 4:44 PM IST

వినాయక చవితి దగ్గరపడిందంటే చాలు అందరి దృష్టి ఖైరతాబాద్​పై పడుతుంది. ఎంత ఎత్తులో, ఏ ఆకారంలో విగ్రహాన్ని తయారు చేస్తున్నారని ఎదురు చూస్తుంటారు. విగ్రహం తయారీ దగ్గరి నుంచి నిమజ్జనం వరకూ అన్ని ప్రత్యేకతలు సంతరించుకునే ఖైరతాబాద్ ఏకదంతుడు​... ఈసారి మాత్రం అన్ని ఆర్బాటాలకు దూరంగా ఉండనున్నాడు. ఈ ఏడాది ఊహించని రీతిలో కరోనా మహమ్మారి విజృంభిచటం వల్ల ఈ ప్రభావం ఖైరతాబాద్ మహా గణనాథునిపై పడింది.

ఖైరతాబాద్​ గణేశ్​ ఈసారి ఏ రూపంలో దర్శనమిస్తాడో తెలుసా?

కోల్​కతా కళాకారులతో విగ్రహం తయారీ

సాధారణ రోజుల్లో ఇప్పటికే దాదాపు విగ్రహం తయారీ పూర్తయి... కళాకారులు తుది మెరుగులు దిద్దుతూ ఉండేవారు. కొవిడ్ ప్రభావంతో ఉత్సవ కమిటి ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాధుని ప్రతిష్ఠపై మల్లగుల్లాలు పడింది. ప్రభుత్వానికి పలు వినతులు చేసింది. చివరకు 9అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఊరేగింపులకు కూడా అనుమతులు లేకపోవటం వల్ల మట్టి విగ్రహాన్ని తయారు చేసి... ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటి నిర్ణయించింది. విగ్రహ తయారికి ఈసారి కోల్​కతాకు చెందిన కళాకారులు రాగా... ఈరోజు తొలి పూజతో విగ్రహ తయారి పనులను ప్రారంభించారు.

ఆన్​లైన్​లో వీక్షించే సౌకర్యం..!

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ధన్వంతరీ అవతారంలో గణనాథుడు దర్శనం ఇవ్వబోతున్నారని అర్చకులు చెబుతున్నారు. శ్రీ మహావిష్ణువు మరో రూపమే ధన్వంతరీ అని తెలిపారు. విగ్రహానికి కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతి దేవిని ప్రతిష్ఠిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా ప్రబలే అవకాశం ఉన్నందున భక్తులెవరూ మండపం వద్దకు రావొద్దని కోరింది. అయితే గణేషుడిని ఆన్​లైన్​లో చూసేందుకు ఉత్సవ కమిటి ఏర్పాట్లు చేస్తోందని నిర్వాహకులు వివరించారు.

ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

Last Updated : Aug 5, 2020, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details