తెలంగాణ

telangana

ETV Bharat / city

Tirumala: సిఫారసు లేఖల స్వీకరణ రద్దు: తితిదే - ttd responding on misinformation

తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో రేపు సాలకట్ల ఆణివార ఆస్థానం ఉన్నకారణంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తితిదే తెలిపింది. దీంతోపాటు తితిదేపై దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Tirumala: సిఫారసు లేఖల స్వీకరణ రద్దు: తితిదే
Tirumala: సిఫారసు లేఖల స్వీకరణ రద్దు: తితిదే

By

Published : Jul 15, 2021, 10:21 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రోజు సాలకట్ల ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా గురువారం వీఐపీ బ్రేక్‌ దర్శనం సిఫారసు లేఖలను స్వీకరించమని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.

తితిదేపై అసత్య ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు..
తితిదే వెబ్‌సైట్‌లోని తోమాల సేవను కొందరు వ్యక్తులు తోమస్‌ సేవగా మార్చి అసత్య ప్రచారం చేస్తున్నారని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. తితిదే ప్రతిష్ఠను దెబ్బతీసి, భక్తుల మనోభావాలకు భంగం కలిగించే ఇలాంటి కుట్రలను తీవ్రంగా పరిగణిస్తోందని.. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం

ఇదీ చదవండి:Baby sale: పేగుబంధంతో హైడ్రామా? విక్రయించి.. అంతలోనే ఫిర్యాదు!

ABOUT THE AUTHOR

...view details