తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. నవంబర్ నెలకు సంబంధించిన కోటాను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రోజుకు 19 వేల టికెట్ల చొప్పున ఉదయం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ స్లాట్లలో టికెట్లు ఉంచారు.
టికెట్లు పొందిన యాత్రికులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తూ.. టికెట్లు లేనివారిని అలిపిరి తనిఖీ కేంద్రంలో నిలిపి వేస్తున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు.