గజవాహనంపై కనువిందు చేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు - తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆరో రోజు ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయం వద్ద గల వాహన మండపంలో అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ సర్వభూపాల వాహనంపై అధిరోహించి భక్తులకు అభయ ప్రధానం చేశారు. కరోనా కారణంగా ఏకాంతంగా సాగిన వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, తితిదే చిన్నజీయర్ స్వామి, బోర్డు సభ్యులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈఓ బసంత్ కుమార్.... ఇతర అధికారులు పాల్గొన్నారు.