Omicron cases in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంకు చెందిన మహిళకు... విశాఖలో మరో వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 19న కువైట్ నుంచి మహిళ విజయవాడ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి స్వగ్రామం పెదపాలెం చేరుకున్నారు. ఒమిక్రాన్ వచ్చిన మహిళను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచినట్లు అదనపు డీఎంహెచ్‌వో వెల్లడించారు. ఆమె భర్త, పిల్లలకు పరీక్షించగా....కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. మహిళ భర్త, పిల్లలకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Omicron cases in Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుకు చేరిన ఒమిక్రాన్ కేసులు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
10:03 December 24
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుకు చేరిన ఒమిక్రాన్ కేసులు
విశాఖలోనూ ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ నెల 15న దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకింది. బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచామని తెలిపారు.
బుధవారం రెండో కేసు
ఈనెల 22న రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళలో ఒమిక్రాన్‌ను గుర్తించారు. ఈనెల 12 నుంచి కెన్యా నుంచి చెన్నై వచ్చిన 39 ఏళ్ల మహిళ... అక్కడి నుంచి తిరుపతి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 12న మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా... శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు. జీనోమ్ సీక్వెన్స్‌లో మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు బుధవారం ప్రకటించారు. ఒమిక్రాన్ బాధితురాలి కుటుంబసభ్యులకు నెగిటివ్‌గా నిర్ధరణ అయింది.
ఈనెల 12న తొలి కేసు..
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు ఈనెల 12 వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. 34 ఏళ్ల వ్యక్తికి ఈ వేరియంట్ నిర్ధరణ అయింది. బాధితుడు ఆరోగ్యవంతంగా ఉండడం యంత్రాంగానికి ఊరటనిచ్చింది. విదేశాల నుంచి వచ్చిన ఆ యువకుడిని కలిసిన వారికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులపై నిఘా పెంచారు.
ఇదీ చదవండి:India covid cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు