తెలంగాణ

telangana

ETV Bharat / city

మూడో రోజు సజావుగా సాగిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ - vaccination news in telangana

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మూడో రోజు సజావుగా సాగింది. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ స్వల్ప సమస్యలు తలెత్తుతున్నా... ముందుగా చేసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందుకెళ్తున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రానికి ఇవాళ మరో మూడున్నర లక్షల డోసులు వచ్చాయని వివరించారు.

third day covid vaccination in telangana
third day covid vaccination in telangana

By

Published : Jan 19, 2021, 6:49 PM IST

మూడో రోజు సజావుగా సాగిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

రాష్ట్రంలో కొవిడ్ వ్యాకినేషన్ సజావుగా సాగుతోందని ప్రజారోగ్యశాఖ వివరించింది. తొలిరోజు 140 కేంద్రాల్లో, రెండో రోజు 335 కేంద్రాల్లో టీకాలను పంపిణీ చేయగా... ఇవాళ వెయ్యికి పైగా కేంద్రాల్లో టీకా అందించారు. ఇవాళ రాష్ట్రానికి మరో మూడున్నర లక్షల టీకా డోసులు వచ్చాయని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రజలకు టీకా అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందన్న శ్రీనివాసరావు.. కొవిన్ సాఫ్ట్​వేర్ సాధారణ ప్రజలకు అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఎవరైనా టీకా కోసం నమోదు చేసుకొమ్మని చెబితే నమ్మి మోసపోవద్దని సూచించారు. తొలివిడత వ్యాకినేషన్​ను రెండు, మూడు వారాల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో విశేష స్పందన లభిస్తోందని డీఎంఈ రమేశ్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.


జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. భద్రాద్రి జిల్లాలో 44 కేంద్రాల్లో 8వేల 540 మందికి వ్యాక్సిన్‌ అందిస్తున్నామని కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. వరంగల్‌లో జిల్లా వ్యాప్తంగా 27 ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. మంగళవారం సుమారు 3 వేల మంది వైద్య సిబ్బందికి టీకా అందించారు. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వైద్యాధికారి నవీన్ ఆధ్వర్యంలో టీకాలు వేశారు. వనపర్తి జిల్లాలో తొలిరోజు 120 మందికి, రెండో రోజు 207 మందికి టీకా అందించారు. మూడో రోజూ టీకా పంపిణీ జోరుగా సాగింది. లబ్ధిదారుల్లో భరోసా నింపుతూ వైద్య సిబ్బంది టీకా పంపిణీ విజయవంతం చేస్తున్నారు.

నాలుగో రోజు నుంచి టీకా పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సర్కారు భావిస్తోంది.

ఇదీ చూడండి:వ్యాక్సినేషన్​కు మంచి స్పందన వస్తోంది: డీఎంఈ రమేశ్​

ABOUT THE AUTHOR

...view details