తెలంగాణ

telangana

Car Accident Case: కారు బీభత్సం కేసులో వెలుగులోకి మూడో వ్యక్తి.. ఇన్ని రోజులు ఎందుకు దాచారంటే?

By

Published : Dec 11, 2021, 10:34 PM IST

Car Accident Case: ఈనెల 5న బంజారాహిల్స్​లో అర్థరాత్రి జరిగిన కారు బీభత్సం కేసులో.. నిందితులు ఇద్దరు కాదు.. ముగ్గురు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరిని బలి తీసుకున్న ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేసి విచారించగా.. మూడో వ్యక్తి పేరు బయటపడింది. ఆ వ్యక్తిని ఇన్ని రోజులు ఎందుకు దాచారంటే..?

third culprit came out in banjarahills  Car Accident Case
third culprit came out in banjarahills Car Accident Case

Car Accident Case: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఈ నెల 5వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరో నిందితుడు వెలుగులోకి వచ్చాడు. రోడ్డు ప్రమాదం కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో నిందితుడు ఎల్బీనగర్‌కు చెందిన వెంకటేశ్​​గా గుర్తించారు. ఘటన జరిగిన రోజు.. అర్థరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తులు మృతికి కారణమైన రోహిత్‌ గౌడ్‌, సాయి సుమన్‌లను పోలీసులు తర్వాతి రోజే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తమదైన శైలిలో విచారిస్తే.. అసలు నిజం..

banjara hills Car Accident: అయితే.. ఈ కేసును లోతుగా విచారించేందుకు నిందితులిద్దరిని కోర్టు అనుమతితో పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. తమతో పాటు వెంకటేశ్​​ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడని.. ఆ కారు కూడా అతడిదేనని పోలీసు విచారణలో నిందితులిద్దరు తెలిపారు. మరో నెల రోజుల్లో వెంకటేశ్​ పెళ్లి ఉండడం వల్ల అతడిని తప్పించినట్టు తేలింది. నిందితులిచ్చిన వివరాల ఆధారంగా వెంకటేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అతడిపై కూడా కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్​లోని అల్కాపురి కాలనీకి చెందిన కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు వెంకటేశ్​ యజమాని.

కాసేపట్లో గదికి వెళ్లే వాళ్లను తిరిగిరానిలోకాలకు..

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రోహిత్​ గౌడ్, సుమన్ ఇద్దరూ మద్యం తాగి కారులో అతి వేగంగా వెళుతూ ఈ ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన అయోధ్యరాయ్, దేబంద్ర కుమార్ విధులు ముగించుకుని బంజారాహిల్స్ రోడ్​ నంబర్​ 2లో నడుచుకుంటూ వెళ్తున్నారు. కొద్దిసేపట్లో వారి గదికి చేరుకునే వాళ్లను కారు రూపంలో మృత్యువు కబళించింది. పూర్తి కథనం కోసం..Banjara Hills Accident : బంజారాహిల్స్​లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఇద్దరు మృతి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details