తెలంగాణ

telangana

ETV Bharat / city

ఖైదీలను విడుదల చేస్తామన్నారు, ఉత్తర్వులు మరిచారు - స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఏళ్లుగా మగ్గుతున్న 75 మంది ఖైదీలను స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆశతో ఖైదీల కుటుంబసభ్యులు నిన్న రాత్రి వరకు జైళ్ల ముందు ఎదురుచూసినా బయటకు రాలేదు. జైళ్ల శాఖ ఐజీని సంప్రదించగా.. ఖైదీల విడుదలకు ప్రభుత్వ ఉత్తర్వులు తమకు చేరలేదని తెలిపారు.

prisoners
prisoners

By

Published : Aug 16, 2022, 6:56 AM IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వివిధ జైళ్లలోని 75 మంది ఖైదీలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో జైళ్లలో ఏళ్లుగా మగ్గుతున్న ఖైదీల్లో ఆశలు రేగాయి. తమ వారు పంద్రాగస్టు సందర్భంగా సోమవారం విడుదలవుతారనే ఆశతో ఖైదీల కుటుంబసభ్యులు ఆయా జైళ్ల ముందు ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూశారు. రాత్రి 10.30 గంటలు దాటినా వారు కారాగారాల నుంచి బయటకు రాకపోవడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ రాజేష్‌ని సంప్రదించగా.. ఖైదీల విడుదలకు ప్రభుత్వ ఉత్తర్వులు తమకు చేరలేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details