కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో క్రెడిట్, డిస్టెన్స్, గ్రేడ్ మార్కులు వెనక్కితీసుకోవాలని... యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఎన్ఎస్‌యూఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రధాన గేటు వద్ద బైఠాయించి... నినాదాలు చేయడంతో పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు. ఎంతకీ వినకపోవడంతో వారిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. లాఠీ ఛార్జ్ చేసి.. ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా పోలీసులు స్టేషన్‌కి తరలించారు.
కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద ఉద్రిక్తత, పోలీసుల లాఠీఛార్జ్ - కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్లోని కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత సెమిస్టర్‌లో క్రెడిట్, డిస్టెన్స్, గ్రేడ్ మార్కులు వెనక్కి తీసుకోవాలని వర్సిటీ మెయిన్ గేట్ ముందు ఎన్ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళను దిగారు. ఎంతకీ వినకపోవడంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Kukatpally JNTU